టాలీవుడ్ సీనియర్ హీరో బాలయ్య ‘రూలర్’ సినిమాతో అభిమానుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బాలకృష్ణ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నారు. ఆయన సరసన నాయికలుగా సోనాల్ చౌహన్.. వేదిక నటించారు. ఈ రోజుతో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. బాలకృష్ణ – వేదిక కాంబినేషన్లోని ఈ పోస్టర్ ఆకర్షణీయంగా వుంది. ఇక రేపటి నుంచి నిర్మాణానంతర కార్యక్రమాలపై పూర్తి దృష్టిపెట్టనున్నారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ‘జై సింహా’ తరువాత బాలకృష్ణ – కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా కావడంతో అందరిలోనూ ఆసక్తి వుంది. ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. భూమిక ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే.
previous article
ఆర్టీసీకి తీపి కబురు..
next article
ప్రియాంక హత్య కేసులో నిందితులు అరెస్ట్…
Related Posts
- /No Comment
ఈ సినిమా హిట్టవ్వకపోతే…
- /No Comment