ఇప్పట్లో సినిమాల్లోకి వెళ్లడం కష్టం అనుకుంటారు. కానీ అప్పట్లో కూడ సినిమాలకోసం ఎంతో మంది కష్టపడ్డారు. వారిలో ఎన్టీఆర్, సావిత్రి , వీరితో పాటు విజయనిర్మలా గారు కూడా చిత్రపరిశ్రమలో రచయితగా .. జర్నలిస్టుగా బీకే ఈశ్వర్ కి ఎంతో అనుభవం వుంది. తాజాగా ఆయన మాట్లాడుతూ, విజయనిర్మల గురించి ప్రస్తావించారు. “విజయనిర్మల అసలు పేరు ‘నిర్మల’ మాత్రమే. తెలుగు .. తమిళ భాషల్లో తనని పరిచయం చేసింది విజయ సంస్థవారు కనుక, నిర్మల పేరుకు ముందు విజయ చేర్చుకున్నారు. విజయవారు తెలుగులో ‘షావుకారు’ సినిమా ద్వారా జానకిని పరిచయం చేశారు. అదే సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్నప్పుడు జానకి పాత్ర కోసం విజయ నిర్మలను తీసుకున్నారు.
తండ్రి పాత్రలో ఎస్వీ రంగారావును ఎంపిక చేసుకున్నారు. తొలిరోజున సెట్లోకి అడుగుపెట్టిన విజయనిర్మలను ఎస్వీఆర్ చూస్తూ, ‘ఏంటి ఈ అమ్మాయా హీరోయిన్? అసలు బాగోనే లేదు .. బక్కగా వుంది .. తీసేయండి .. కేఆర్ విజయను పెట్టండి .. ఆ అమ్మాయి అయితే బాగుంటుంది’ అన్నారట. దాంతో విజయ నిర్మల ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో దర్శకుడు నాగిరెడ్డిగారు పేకప్ చెప్పారు. ఆ తరువాత రెండు రోజులకి మళ్లీ విజయ నిర్మలకి కబురు వెళ్లింది. మేకప్ వేసుకుని సెట్లోకి అడుగుపెట్టిన విజయ నిర్మలకి ఎస్వీఆర్ స్థానంలో ఎస్వీ సుబ్బయ్య అనే ఆర్టిస్ట్ కనిపించారట. దర్శక నిర్మాతలు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం గురించి అర్థమై మనసులోనే వాళ్లకి కృతజ్ఞతలు తెలుపుకున్నారట” అని చెప్పుకొచ్చారు. ఆ రోజున వారు తీసుకున్న నిర్ణయం వల్లే మనం ఇంత గొప్ప నటిని, దర్శకురాలిని గురించి తెలుసుకున్నాం.