టాలీవుడ్ క్రేజ్ హీరో విజయ్‌దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తోన్న సినిమా వరల్డ్ ఫేమస్ లవర్
. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. రీసెంట్గా విడుదలైన విజయ్ దేవరకొండ ఫస్ట్‌లుక్ డిఫరెంట్‌గా ఉందనే టాక్ వస్తుంది. ఇందులో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, క్యాథరిన్ ట్రెసా, ఇజాబెల్లా హీరోయిన్స్‌గా అభిమానుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవమైన ఫిబ్రవరి 14న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేశారు. ప్రేమకథా చిత్రం అందులోనూ యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ నటిస్తోన్న చిత్రం కావడంతో ఈ సినిమా రీలీజ్‌కు లవర్స్ డే అయితే బావుందనేది ఆలోచనగా కనపడుతుంది. సెన్సిబుల్ సినిమాలు చేసే డైరెక్టర్ క్రాంతి మాధవ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఎలాంటి సెన్సిబుల్ పాయింట్‌ను చూపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
