రాహుల్ ఫై ఝాన్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది.

మూడు నెలల పాటు తెలుగు ప్రేక్షకులకు వినోదం పంచిన బిగ్ బాస్-3 టైటిల్ ను రాహుల్ సిప్లిగంజ్ గెలుచుకున్న విషయం తెలిసిందే. అతడికి యాంకర్ శ్రీముఖి గట్టిపోటీనిచ్చినప్పటికీ గెలవలేకపోయింది. తొలి రెండు సీజన్లలోనూ పురుష కంటెస్టెంట్లే గెలిచారని, ఈ సారైనా మహిళను గెలిపిద్దామని శ్రీముఖి అభిమానులు ప్రచారం చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. దీనిపై  యాంకర్‌ ఝాన్సీ  స్పందించి అసంతృప్తి వ్యక్తం చేసింది.అమెరికా లాంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదని, అలాంటిది ఇక్కడ తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్‌ విజేతగా మహిళను ఎందుకు గెలిపిస్తారని ప్రశ్నించింది. లింగభేదం ఇప్పటికీ ఉందని సోషల్ మీడియాలో పేర్కొంది. బిగ్‌బాస్‌ హౌస్‌లో శ్రీముఖి పర్ఫార్మెన్స్ పై ఝాన్సీ ప్రశంసలు కురిపించింది.

Leave a Response