దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది మన అందాల సుందరి రకుల్ ప్రీత్ సింగ్. ఢిల్లీకి చెందిన రకుల్ హైదరాబాద్లోనే స్థిరపడింది. టాలీవుడ్ యాంగ్ హీరో రానాతో ఈమె డేటింగ్ చేస్తోందంటూ ఇటీవల టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తరచుగా బయట కలిసి కనిపిస్తుండడంతో ఈ వదంతులు మొదలయ్యాయి. తాజాగా ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రానాతో డేటింగ్ గురించి రకుల్ స్పందించింది. తానెవరితోనూ డేటింగ్లో లేనని స్పష్టం చేసింది. నేను, మంచు లక్ష్మి, రానా క్లోజ్ ఫ్రెండ్స్. మా బ్యాచ్లో ఇంకా చాలా మంది ఉన్నారు. రానా ఇల్లు, నా ఇల్లు పక్కపక్కనే. నా కెరీర్ ప్రారంభం నుంచే రానా నాకు తెలుసు. ఆయన నాకు మంచి స్నేహితుడు మాత్రమే. నేను ఇప్పటివరకు సింగిల్గానే ఉన్నారు. నాకు ప్రేమించేంత సమయం లేదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్నాన
ని ఈ సుందరి అందరి అనుమానాలు క్లియర్ చేసింది..