మిస్సయినందుకు బాధపడ్డానని అంటున్నాఅనుపమ….

రంగస్థలం సినిమాను మిస్సయినందుకు బాధపడ్డానని అంటున్నారు నటి అనుపమ పరమేశ్వరన్. ఆమె కథానాయికగా నటించిన ‘రాక్షసుడు’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో తాను చేయబోతున్న సినిమాల గురించి, ‘రాక్షసుడు’ సినిమా గురించి ఎన్నో విషయాలను పంచుకున్నారు.సినిమా చూశాకే ఒప్పుకొన్నాను‘రాక్షసన్‌’ రీమేక్‌లో నటించాలని దర్శకుడు రమేశ్‌ నన్ను సంప్రదించారు. అయితే షూటింగ్‌లతో బిజీగా ఉండి అప్పటికి నేను సినిమా చూడలేదు. మా నాన్న‘ ఈ సినిమా చాలా బాగుంది చూడు’ అని చెప్పినప్పుడు చూశాను. వెంటనే రీమేక్‌లో నటించడానికి ఒప్పుకొన్నాను. సినిమాలో నా పాత్ర నిడివి చిన్నదే అయిన టర్నింగ్‌ పాయింట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. మంచి స్క్రిప్ట్స్‌ రావడం లేదు. అందుకే హలో గురు ప్రేమ కోసమే’ తర్వాత చాలా గ్యాప్‌ తీసుకున్నాను. అదీకాకుండా తమిళంలో ఒకటి, మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను.అమల పాల్‌ అంటే చాలా ఇష్టం తమిళంలో వచ్చిన ‘రాక్షసన్‌’ సినిమాలో అమల పాల్‌ కథానాయికగా నటించారు. నాకు ఆమె అంటే నాకు చాలా ఇష్టం. సినిమాలో అమల పాత్రకు నేను న్యాయం చేశాననే అనుకుంటున్నాను. ఒకరిని అనుకరించకుండా నాలాగా నేను నటించాను.అలా కుదిరిపోతున్నాయ్‌ రాక్షసన్‌’ నాకు రెండో రీమేక్‌. ‘ప్రేమమ్‌’ రీమేక్‌లో నా పాత్రలో నేనే నటించా. ‘నిన్నుకోరి’ తమిళ రీమేక్‌లో నటిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమేక్‌లే చేస్తున్నాను. అలా కుదిరిపోతున్నాయ్‌. అయితే ‘రాక్షసుడు’ సినిమాలో పెద్దగా మార్పులు చేయలేదు. తెలుగు నేటివిటీకి తగినట్లు మాత్రమే తీర్చిదిద్దాం. సినిమా స్టోరీని డిస్టర్బ్‌ చేయలేదు.ఇందులో గ్లామరస్‌గానే ఉన్నాగా.. సినిమాలో నా పాత్ర చాలా సింపుల్‌గా ఉంటుంది‌. నేనెప్పుడూ నటించని టీచర్‌ పాత్రను పోషించాను. ప్రేక్షకులు నా పాత్రను ఎలా స్వీకరిస్తారో అని అనుకుంటున్నాను. గ్లామర్‌ పాత్రలను పక్కన పెట్టానని అంటున్నారు. సినిమాలో అందంగానే ఉన్నాగా! అంటే నాది గ్లామరస్‌ పాత్రే కదా! సినిమా మొత్తం చీరలోనే కనిపిస్తాను. నేను ఐదో తరగతి నుంచి చీర కట్టుకుంటున్నా. నాకు చీరలంటే చాలా ఇష్టం. కాబట్టి కొత్త ఫీలింగ్‌ ఏమీ కలగలేదు.రంగస్థలం మిస్సయ్యాను రామ్‌చరణ్‌తో ‘రంగస్థలం’ సినిమాను మిస్సయినందుకు బాధగా ఉంది. అయితే సినిమా చూశాక నేను చేయడం కంటే సమంత బాగా చేశారు అనిపించింది. డేట్లు కుదరక సినిమాను ఒప్పుకోలేకపోయాను కానీ, మరో కారణమేమీ లేదు. టిక్‌ టాక్‌ క్వీన్‌ అని పిలుస్తున్నారునేను కూడా చాలా టిక్‌టాక్‌ వీడియోలు చేశాను. అందరూ టిక్‌టాక్‌ క్వీన్‌ అని పిలుస్తున్నారు. ఏదో సరదాగా అనిపించింది చేశాను. మ్యూజిక్‌ ఆల్బమ్స్‌ రూపొందించాలన్న ఆలోచన కూడా ఉంది. తమిళ దర్శకుడు ఆల్ఫోన్స్‌ పుత్రేన్‌ వద్ద ఓ సినిమాకు సహాయ దర్శకురాలిగా పనిచేశాను. ఓ హీరోయిన్‌గా కాకుండా తెర వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాను. నో కామెంట్స్‌క్రికెటర్ కే.ఎల్‌ రాహుల్‌తో డేటింగా? ఈ వార్తలు ఎప్పుడు వచ్చాయ్‌? అయినా దీని గురించి మాట్లాడదలచుకోలేదు. నో కామెంట్స్‌. ఈ విషయంలో చెప్పడానికి ఏమీ లేదు. ఈ ఒక్కటి అడగకండి.

Leave a Response