ఇష్క్, మనం, 24లాంటి వైవిధ్యమైన సినిమాలు అందించిన దర్శకుడు విక్రమ్ కుమార్ రూపొందిస్తున్న తాజా చిత్రం గ్యాంగ్‌లీడర్. నేచురల్ స్టార్ నాని ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రివేంజ్ రైటర్‌గా, ఐదుగురు ఆడవాళ్ల గ్యాంగ్‌కు నాయకుడిగా నాని ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.తాజాగా షూటింగ్ సమయంలో తన డైరెక్టర్ విక్రమ్ కుమార్ ప్రవర్తన ఎలా ఉంటుందో ఓ వీడియో ద్వారా నాని వివరించాడు. షూటింగ్ స్పాట్లో ఓ పాపతో విక్రమ్ సరదాగా ఆడుకుంటున్న వీడియోను నాని తన ట్విటర్,ఇంస్టాగారం ఖాతాలో పోస్ట్ చేశాడు. గ్యాంగ్‌లీడర్ డైరెక్టర్ విక్రమ్ కుమార్ సెట్స్‌లో ఎలా ప్రవర్తిస్తున్నారో చూడండి అంటూ నాని సరదాగా ట్వీట్ చేశాడ
