ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సురేశ్ బాబు…

టాలీవుడ్ యాంగ్ హీరో రానా ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వంలో ‘హిరణ్య కశిప’ సినిమా అభిమానుల ముందుకు వస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన సెట్ వర్క్ రామానాయుడు స్టూడియోలో జరుగుతోంది. మరో వైపున షాట్ డివిజన్ తో సహా స్క్రిప్ట్ ను సిద్ధం చేశారు. వచ్చే ఏడాదిలో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నారు.అయితే ఇటీవల అమెరికాలో ఆపరేషన్ చేయించుకున్న రానా .. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ‘హిరణ్య కశిప’లో ప్రధాన పాత్రను చేయనున్న ఆయన, ఆ పాత్ర కోసం మళ్లీ కండలు పెంచవలసిన పని ఉంది.. త్వరలోనే అందుకు సంబంధించిన కసరత్తు మొదలుకానుందని అంటున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఈ సినిమా నిర్మితమవుతోంది. తమ బ్యానర్ పై ప్రతిష్ఠాత్మక చిత్రంగా దీనిని తీర్చిదిద్దడానికి సురేశ్ బాబు నిర్ణహించుకున్నారు.

Image result for rana daggubati

Leave a Response