పూలరంగడు కలర్‌ ఫొటో కాదు కాబట్టి సరిపోయింది…..

ఈ ఫొటో చూసి మా అమ్మానాన్నల్ని తిట్టకండి అంటున్నారు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఆయన మంగళవారం తన బాల్యంలో దిగిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. అందులో ప్యాంటు, చొక్కా, గుబురు జుట్టుతో నిల్చుని ఉన్నారు. ఈ సందర్భంగా నెటిజన్లను ఉద్దేశిస్తూ వర్మ సరదా కామెంట్‌ చేశారు. ‘పాఠశాల రోజుల్లో నేను దిగిన ఫొటో ఇది. మీరు మా అమ్మానాన్నను తిట్టకండి.. ఆ దుస్తుల్ని నేనే కొనుకున్నా’ అని పోస్ట్‌ చేశారు. దీనికి నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వచ్చాయి. ‘మీ అభిరుచి అలాంటిది కాబట్టే చిత్ర పరిశ్రమకు వచ్చారు, పూలరంగడు, కలర్‌ ఫొటో కాదు కాబట్టి సరిపోయింది, మరి హెయిర్‌ స్టైల్‌ విషయం ఏంటి?..’ అంటూ కామెంట్లు చేశారు.అదేవిధంగా ఈ నెల 18న ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విడుదల నేపథ్యంలో తన స్నేహితుడు, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు వర్మ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ‘‘ఇస్మార్ట్‌ శంకర్‌’ అడ్వాన్స్‌ బుకింగ్‌ అద్భుతంగా జరుగుతోందని విన్నాను. పూరీ నీ ముఖంలో సినిమా సక్సెస్‌ మెరుపు ఇప్పటికే నాకు కనిపించింది’ అంటూ పూరీ ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’లో రామ్‌ కథానాయకుడిగా నటించిన సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, నభా నటేష్‌ కథానాయికలు. పూరీ, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. ఇందులో రామ్‌ పక్కా హైదరాబాదీ కుర్రాడిగా కనిపించనున్నారు.

Leave a Response