ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసంలో సినీ తారలతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని మోదీ ఇంట జరిగిన ఆ కార్యక్రమంలో దక్షిణాది నుంచి పెద్దగా ప్రాతినిధ్యం కనిపించలేదు. దాంతో విమర్శలు వెల్లువెత్తాయి. సినీ రంగం అంటే బాలీవుడ్ ఒక్కటే కాదని, భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దక్షిణాది చిత్ర పరిశ్రమలు కూడా దోహదం చేస్తున్నాయని పలువురు కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. మెగా కోడలు, అపోలో ఫౌండేషన్ అధినేత ఉపాసన కూడా మోదీని విమర్శించారు.ఈ నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ లను ప్రధాని మోదీ ఆహ్వానించినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ తండ్రీతనయులు ఢిల్లీ వెళుతున్నారు. త్వరలోనే తండ్రితో కలిసి ఢిల్లీ వెళుతున్నానని రామ్ చరణ్ ఓ జాతీయ మీడియా సంస్థకు తెలిపినట్టు సమాచారం. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల ఎన్నికల హడావుడి ఇంకా కొనసాగుతుండడంతో ఆ సందడి తగ్గిన తర్వాత వెళ్లాలనుకుంటున్నామని చరణ్ చెప్పినట్టు తెలుస్తోంది.
previous article
పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు…
next article
108, 104 ఉద్యోగులకు తీపి కబురు…
Related Posts
- /
- /No Comment