టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి రూపొందిస్తున్న మరో భారీ సినిమా అభిమానుల ముందుకు వస్తుందిఆర్ఆర్ఆర్
. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ సినిమాలో కలిసి నటిస్తున్నారన విషయం మన అందరికి తెలిసిందే. కొమరం భీమ్ పాత్రలో ఎన్టీయార్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై ఏడాది పూర్తయిపోయింది. అయినప్పటికీ ఈ సినిమాకు సంబంధించి ఒక్క లుక్ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు.అటు ఎన్టీయార్ ఫ్యాన్స్, ఇటు చెర్రీ అభిమానులు తమ హీరోల ఫస్ట్‌లుక్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. త్వరలోనే అభిమానుల ఎదురు చూపులు ఫలించబోతున్నాయట. ఇద్దరు హీరోల లుక్‌లు బయటకు రాబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటో తేదీన ఎన్టీయార్ ఫస్ట్‌లుక్, సంక్రాంతి సందర్భంగా చెర్రీ లుక్ బయటకు రాబోతున్నాయట. అప్పటి నుంచి రెగ్యులర్‌గా సినిమాలోని కీలక నటుల లుక్లన్నింటినీ విడుదల చేస్తారట.
