సూర్య – సెల్వ రాఘవన్ కాంబినేషన్లో అభిమానుల ముందుకు వచ్చిన సినిమా ‘ఎన్జీకే’. ఈ సినిమా నిన్ననే థియేటర్లకు వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమాను నిన్ననే రిలీజ్ చేశారు. సూర్య సరసన సాయిపల్లవి .. రకుల్ కథానాయికలుగా నటించారు. తెలుగు వెర్షన్ కి పెద్దగా రెస్పాన్స్ లేకపోయినప్పటికీ, తమిళంలో ఈ సినిమా తొలి రోజున భారీ వసూళ్లను రాబట్టిందని అంటున్నారు.
ముఖ్యంగా నిన్న ఒక్క రోజునే చెన్నై నగరంలో ఈ సినిమా కోటి రూపాయలకి పైగా వసూళ్లను సాధించింది. సూర్య కెరియర్లో తొలి రోజునే చెన్నై లో కోటి రూపాయలకి పైగా వసూళ్లు సాధించిన తొలి చిత్రం ఇదేనని ట్రేడ్ అనలిస్ట్ ఎల్.ఎమ్.కౌశిక్ ట్వీట్ చేశాడు. ఓవర్సీస్ లోను ఈ సినిమా తొలి రోజున మంచి వసూళ్లను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఈ రోజు .. రేపు ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు.