చిరు ఇంట్లో సంబరాలు…

టాలీవుడ్ లో చిత్ర పరిశ్రమతో పాటు ఇతర దక్షిణాది సినీ పరిశ్రమతో పాటు తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అనేకమంది ప్రముఖ నటీనటులు ప్రతి ఏడాది ఓ చోట కలుస్తుండడం ఆనవాయితీ అన్న సంగతి మన అందరికి తెలిసిందే. చిరంజీవి, రజనీకాంత్, మోహన్ లాల్, సుమన్, శరత్ కుమార్, ప్రభు, భానుచందర్, నరేశ్, రాధిక, జయసుధ, సుమలత, లిజి, ఖుష్బూ తదితరులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మరోసారి కోలాహలం సృష్టించేందుకు అందరూ హైదరాబాద్ చేరుకున్నారు. ఈసారి వారి వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి ఇల్లు వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే చిరు తన నివాసాన్ని అపురూపమైన అతిథుల కోసం సిద్ధం చేశారు. రెండ్రోజుల పాటు తారలు చిరు ఇంట్లో ఆతిథ్యం స్వీకరించడమే కాదు, ఆటపాటలు, ర్యాంప్ వాక్ లు, ఇతర కార్యక్రమాలతో హాయిగా ఆస్వాదించనున్నారు.

Leave a Response