ఖరీదైన వస్తువుల పట్ల బన్నీకి ఆసక్తి..

టాలీవుడ్ యాంగ్ హీరో అల్లు అర్జున్. తన మొదటి చిత్రం కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో తెలుగు అంభిమానుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తరువాత ఎన్నో సినిమాలో నటించాడు. తనకు చిన్నపాటి నుంచి డ్యాన్స్ అంటే ప్రాణం. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, కేరళలో అల్లు అర్జున్ కు అభిమానుల సంఖ్య ఎక్కువే అన్ని చెప్పవచ్చు. ఫేస్ బుక్ లో సుమారు కోటి మంది అభిమానులున్నారు. కేరళ లో ఉన్న అల్లు అర్జున్ అభిమానులు బన్నీ ని మల్లు అర్జున్ అని పిలుస్తారు.


అర్జున్ తెరపైనే కాదు .. బయట కూడా తనదైన ప్రత్యేకతను కనబరుస్తుంటాడు. ఖరీదైన వాచ్ లు .. టీషర్టులు .. కార్ల విషయంలోను ఆయన తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. ఇక అల్లు అర్జున్ ‘క్యారవాన్’ చూస్తే ఆయన అభిరుచి ఎలా ఉంటుందనేది అర్థమవుతుంది. నా పేరు సూర్య సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక క్యారవాన్ ‘పిక్’ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ క్యారవాన్ బ్లాక్ కలర్లో చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. ఈ క్యారవాన్ పై ‘A A’ అనే అక్షరాలు రాసి ఉంటాయి. ఈ క్యారవాన్ ఖరీదు అక్షరాలా 7 కోట్ల రూపాయలట. ఇంటీరియర్ కోసమే 3.5 కోట్ల ఖర్చు చేశారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. విలాసవంతమైన సకల సౌకర్యాలు ఈ క్యారవాన్లో ఉన్నాయని అంటున్నారు. ఇంతటి లగ్జరీ క్యారవాన్ దేశంలో మరే హీరోకి లేదని చెప్పుకుంటున్నారు ఇండస్ర్టీలో. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు నిర్మాతలు.

Leave a Response