కావాళ్ళని నన్నుసినిమా నుంచి తొల‌గించారు…

టాలీవుడ్ లో ఆడై సినిమాలో న‌టించి సంచ‌ల‌నం సృష్టించింది హీరోయిన్ అమ‌లాపాల్‌. ఇటీవ‌ల విడుద‌లైన ఆ సినిమా టీజ‌ర్ ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో మన అందరికి తెలిసిందే. న‌గ్నంగా న‌టించిన అమ‌ల ధైర్యాన్ని సినీ ప్ర‌ముఖులంద‌రూ మెచ్చుకున్నారు. అయితే విజ‌య సేతుప‌తితో సినిమా చేస్తున్న నిర్మాత మాత్రం అమ‌ల‌ను తన సినిమా నుంచి త‌ప్పించారు. ముందు ఒప్పుకున్న దాని కంటే ఎక్కువ రెమ్యున‌రేష‌న్ అడ‌గ‌డం, కొత్త ష‌ర‌తులు విధించ‌డం వ‌ల్లే అమ‌ల‌ను త‌ప్పించామ‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. అయితే అది నిజం కాద‌ని, ఆమె టీజ‌ర్ చూసి భ‌య‌ప‌డ‌డం వ‌ల్లే త‌న‌ను సినిమా నుంచి త‌ప్పించార‌ని తాజాగా విడుద‌ల చేసిన ప్రెస్‌నోట్‌లో అమ‌ల పేర్కొంది. నేను విజయ్‌ సేతుపతికి వ్యతిరేకంగా ఈ ప్రెస్‌ నోట్ విడుద‌ల చేయ‌లేదు. ఆయనతో కలిసి నటించాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఈ సారి అవ‌కాశం వ‌చ్చింది. అయితే నా పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తూ న‌న్ను సినిమా నుంచి తొల‌గించారు. ఆ ఆరోప‌ణ‌ల‌కు బ‌దులివ్వాల‌నే ఉద్దేశంతోనే ఈ ప్రెస్‌నోట్ విడుద‌ల చేశాను. నేను రెమ్యున‌రేష‌న్ పెంచేశాన‌ని, కొత్త ష‌ర‌తులు పెట్టాన‌ని, అందువ‌ల్లే సినిమా నుంచి త‌ప్పించామ‌ని అంటున్నారు. నిజానికి ‘ఆమె’ టీజర్‌ విడుదలయ్యాకే నన్ను విజయ్‌ సేతుపతి సినిమా నుంచి తొలగించాల‌ని నిర్మాత రత్న కుమార్ భావించారు.ఆమెసినిమా టీజ‌ర్ కార‌ణంగా ఎక్క‌డ వారి సినిమాపై నెగిటివ్‌ కామెంట్స్‌ వస్తాయోననే ఉద్దేశంతోనే నన్ను తొలగించారనిపిస్తోంది. ఇన్నేళ్ల నా కెరీర్‌లో చాలా నిర్మాణ సంస్థ‌ల‌కు నేను మ‌ద్ద‌తుగా నిలిచాను. రావాల్సిన డ‌బ్బును కూడా చాలా సార్లు వ‌దుల‌కున్నానని అమ‌ల పేర్కొంది.

Image result for amala paul

Leave a Response