టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ ఈరోజు తన 34వ పుట్టినరోజు నేడు. ఈ నేపథ్యంలో అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్‌మీడియా వేదికగా విషెస్ తెలుపుతున్నారు. ఆమె ఎప్పుడూ సంతోషంగా ఉంటూ, ఇంకా ఎన్నో సినిమాలతో అభిమానుల ముందుకు రావాలని కోరుకుంటున్నారు పలువురు నటులు.
తమన్నా: హ్యాపీ బర్త్‌డే మై కాజూ.. బాగా ఎంజాయ్ చెయ్.
రానా దగ్గుబాటి: కాజల్.. ఈ ఫొటో నీకు, నీ అభిమానుల కోసం. హ్యాపీ బర్త్‌డే.
సమంత: అందమైన కాజల్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వెప్పుడూ ఇలాగే దృఢంగా ఉండాలి. నీ మనసు కోరుకునేవన్నీ దక్కాలని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్.
సందీప్ కిషన్: హ్యాపీ బర్త్‌డే సూపర్‌స్టార్. మంచి స్నేహితురాలిగా ఉన్నందుకు ధన్యవాదాలు.
ప్రశాంత్ వర్మ: హ్యాపీ బర్త్‌డే కాజల్.
ప్రదీప్ మాచిరాజు: ఎప్పుడూ ఇలాగే నీ నవ్వును నలుగురికి పంచుతూ ఉండు కాజల్. హ్యాపీ బర్త్‌డే. నీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా.
ఈషా రెబ్బా: హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ కాజల్.
మంజిమా మోహన్: నాకు తెలిసిన స్వీటెస్ట్ వ్యక్తుల్లో ఒకరైన కాజల్‌కు జన్మదిన శుభాకాంక్షలు.
వెన్నెల కిశోర్: పుట్టినరోజు శుభాకాంక్షలు.