టాలీవుడ్ లో క్యూట్‌గా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సుందరి రాశీఖన్నా.. ఇప్పుడు తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తుంది. అయితే రాశీఖన్నా గురించి తాజాగా ఓ విషయం బయటికొచ్చింది. ఈ విషయం తెలిసిన సినీ జనాలు రాశీఖన్నా పైకి కనిపించేటంత అమాయకురాలు కాదంటున్నారు. ఎందుకంటే సినిమాలో సీన్ల విషయంలో కానీ, డ్యాన్సుల సందర్భంగా స్టెప్పుల విషయంలో కానీ అస్సలు కాంప్రమైజ్ కాదట. హీరోతో సమానంగా కాకపోయినా, తనకూ దాదాపు అన్ని సీన్లు ఉండాలనీ, అలాగే డ్యాన్సులప్పుడు కూడా తనకు రెండు స్టెప్పులు ఎక్కువే ఇవ్వాలని అడుగుతుందట. ఈ విషయాల్లో అవసరమైతే హీరోలతో గొడవ కూడా పడుతుందట. ఈ విషయాన్ని రాశీఖన్నానే స్వయంగా ఒప్పుకోవడం టాలీవుడ్ లో విశేషం గా మారింది.
