టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ అమ్మడుకి అవకాశాలు కరువయ్యాయి. అటు కోలీవుడ్ లో ఇటు తెలుగు నుంచి అవకాశాలు పెద్దగా లేకపోవడంతో రకుల్ ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి పెట్టిందన్న సంగతి మన అందరికి తెలిసిందే. అక్కడ జరిగే పార్టీలకు, ఫంక్షన్లకు క్రమం తప్పకుండా హాజరవుతూ ప్రముఖుల దృష్టిలో పడే ప్రయత్నం చేస్తోంది ఈ అమ్మడు. అయితే పార్టీలకు హాజరైనంత మాత్రన సినిమా అవకాశాలు రావని రకుల్ తాజాగా అభిప్రాయపడింది. పార్టీలకు హాజరైనంత మాత్రాన హీరోయిన్లకు అవకాశాలు వచ్చేస్తాయన్నది అపోహ మాత్రమే. అయితే కాంటాక్ట్‌లో ఉండటం వల్ల మనకి కావాల్సిన అవకాశాలు రావొచ్చు. కానీ, ఇక్కడ కాంటాక్ట్ కంటే ట్యాలెంట్ అనేదే ముఖ్యం. మనకు ట్యాలెంట్ ఉంటే పార్టీలకు వెళ్లకపోయినా అవకాశాలు వస్తాయ
ని రకుల్ చెప్పడం విశేషం.
