‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ, తన కెరియర్లోని ఒడిదుడుకులను గురించి ప్రస్తావించారు. నా తొలి సినిమా ‘మున్నా’ పరాజయం పాలైన తరువాత నేను చాలా డీలాపడిపోయాను. నిరాశా నిస్పృహలతో రోజులు చాలా భారంగా గడుస్తున్నాయి.
అలాంటి పరిస్థితుల్లో ఓ కాఫీ షాప్ లో చరణ్ తారసపడి ‘మున్నా’ విషయం ప్రస్తావిస్తూ డైరెక్టర్ గా నేను ఫెయిల్ కాలేదని చెప్పాడు. ఆ తరువాత ఎన్టీఆర్ – దిల్ రాజు కూడా అదే మాట అనడంతో నాలో ఉత్సాహానికి ఊపిరిపోసినట్టు అయింది. అప్పుడు నేను మళ్లీ ఒక కథపై కూర్చుని కసరత్తుచేసి, దిల్ రాజు – ఎన్టీఆర్ లకు వినిపించాను. వాళ్లిద్దరికీ బాగా నచ్చేసిన ఆ కథే ‘బృందావనం’. ఈ సినిమా తరువాత చరణ్ తో ‘ఎవడు’ చేశాను” అని చెప్పుకొచ్చారు.