రామ్ పోతినేని అన్నగానే అలాగే రామ్ సినిమాలకు యూత్ లో ఎక్కడాలేని క్రేజ్ ఉంటుంది.అలాగే రామ్ మొదటి సినిమా ‘దేవదాస్’ నుండి ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా వరకు సూపర్ గా నటించాడు మన హీరో. రామ్ మన తెలుగు హీరో.అలాగే మన తెలుగు టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు రామ్.పెద్ద హీరోయిన్స్ నుండి కొత్త హీరోయిన్స్ వరకు ఏ హీరోయిన్ తో నైనా నటిచగలిగే వాడు రామ్.అలా ఇప్పుడు సరి కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు.ఇప్పుడు ఆ సినిమా గురించి తెలుసుకుందాం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ఇస్మార్ట్ శంకర్’ రూపొందింది. నిధి అగర్వాల్ – నభా నటేశ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా నుంచి తాజాగా ఒక సింగిల్ ను వదిలారు. “ఉండిపో ఉండిపో చేతిలో గీతలా .. ఎప్పుడూ ఉండిపో నుదుటిపై రాతలా .. ఉండిపో ఉండిపో కళ్లలో కాంతిలా .. ఎప్పుడూ ఉండిపో పెదవిపై నవ్వులా” అంటూ ఈ పాట సాగుతోంది.మణిశర్మ కట్టిన బాణీ చాలా బాగుంది. యూత్ కి వెంటనే కనెక్ట్ అయ్యేలా ఆయన ఈ పాటను స్వరపరిచారు. భాస్కర భట్ల సాహిత్యం చాలా బాగుంది. ప్రేమికుల భావజాలాన్ని ఆవిష్కరించడానికి ఆయన అందమైన పదజాలాన్ని అర్థవంతంగా ఉపయోగించాడు. అనురాగ్ కులకర్ణి – రమ్య బెహరా ఈ పాటకి ప్రాణం పోశారు. మొత్తంగా చెప్పాలంటే ఈ పాట ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిలా నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.అలాగే ఈ సినిమా వచ్చే నెలలో మన ముందుకు రానుంది.