గాయని స్మితను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్ప్రైజ్ చేశారట. ఈ విషయాన్ని స్మిత సోషల్మీడియా ద్వారా తెలిపారు. తను గాయనిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు అభినందిస్తూ చంద్రబాబు పంపిన లేఖను షేర్ చేశారు. ‘ఇది నిజంగా నాకు సర్ప్రైజ్. ధన్యవాదాలు చంద్రబాబు గారు’ అని ఆనందం వ్యక్తం చేశారు.‘నటి, గాయని స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు ఆహ్లాదం కల్గిస్తున్నందుకు అభినందనలు. శ్రోతలను అలరించడానికి వివిధ రూపాల్లో పాటలను వేదికగా చేసుకుని స్మిత సాగిస్తున్న ప్రయాణం అనిర్వచనీయం . కాలానికి అనుగుణంగా పాటల పందిరి నిర్మాణం మరింత జనరంజకం అవుతుందని విశ్వసిస్తున్నాను. ఒక్క తెలుగులోనే కాకుండా సంగీతానికి ఎల్లలు లేవరని తెలుపుతూ 9 భాషల్లో పాటలు పాడిన ఘనత సాధించడం ప్రశంసనీయం. భవిష్యత్తులోనూ స్మిత తన మధుర కంఠంతో ఇలానే అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను’ అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
previous article
రకుల్ కాజల్ హీరోయిన్గా….
next article
అనుష్క టైటిల్ పోస్టర్ విడుదల…..
Related Posts
- /No Comment
జాక్ పాట్ రిలీజ్ డేట్ ఖరారు…
- /No Comment