ఆకాశం నీ హద్దురా’లో కీలకమైన పాత్రలో మోహన్ బాబు

జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకోకుండా సూర్య తన దూకుడు చూపుతూనే వున్నాడు. అభిమానులకి .. తనకి మధ్య సినిమా పరంగా గ్యాప్ రాకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ క్రమంలోనే ఆయన సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.’గురు’ దర్శకురాలిగా సుధా కొంగర తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె దర్శకత్వంలో సూర్య చేస్తున్న ఈ  సినిమా, బయోపిక్ కావడమే విశేషం. పైలెట్ ‘జీ ఆర్ గోపీనాథ్’ జీవితచరిత్రగా ఈ సినిమా నిర్మితమవుతోంది. తమిళంలో ఈ సినిమాను ‘సురారై పోట్రు’ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. తెలుగు వెర్షన్ కి సంబంధించి వదిలిన సూర్య ఫస్టులుక్ ఆకట్టుకుంటోంది. జీవీ ప్రకాశ్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో కథానాయికగా అపర్ణ బాలమురళి నటిస్తుండగా, నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు.

Leave a Response