గతంలో ఓ బాలుడు తనను ‘ఆంటీ’ అని పిలిచిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ ఆగ్రహానికి గురైంది. ఈ నేపథ్యంలో ఆమె దుర్భాషలాడిన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. చివరకు ఆమెపై ‘నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్’కు ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. ఇటీవల ఆమె ‘సన్ ఆఫ్ అభిష్’ అనే షోలో పాల్గొంది. సినీ రంగంలోకి ప్రవేశించాక ఎదురైన అనుభవాలను చెప్పింది. తన కెరీర్ ఆరంభంలో ఓ ప్రకటనలో నటించానని, ఆ సమయంలో ఓ బాలనటుడు తనను ఆంటీ అన్నాడని చెప్పింది. షోలో అతడిని బాగా తిట్టింది.ఆ సమయంలో తాను నిరాశకు గురయ్యాయని స్వరా భాస్కర్ చెప్పింది. పిల్లలు దయ్యాలతో సమానమని వ్యాఖ్యానించింది. ఇందుకు సంబంధించిన ఈ వీడియో బయటకు వచ్చింది. అయితే, షోలో ఇలా ఆమె దుర్భాషలాడడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. గతేడాది పిల్లలపై వేధింపులకు వ్యతిరేకంగా స్వరా భాస్కర్ ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఓ వైపు బుద్ధులు చెబుతూ మరోవైపు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు.
previous article
రాహుల్ ఫై ఝాన్సీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
next article
మొదటి సినిమానే వాయిదా…ధృవ్
Related Posts
- /No Comment
మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో…
- /No Comment