ప్రేమమ్
సినిమాతో దక్షిణాదిలో మంచి గుర్తింపు సంపాదించుకుందిమన అందాల సుందరి అనుపమా పరమేశ్వరన్. అదే సినిమా రీమేక్‌తో తెలుగువారినీ పలకరించింది ఈ అమ్మడు. ఆ తర్వాత తెలుగులో పలువురు టాప్ హీరోల సరసన నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆ పాత్రలన్నీ గ్లామర్‌కు దూరంగా పక్కంటి అమ్మాయి తరహా పాత్రలే.తనకు అలాంటి పాత్రలే సరిపోతాయని, గ్లామరస్ పాత్రలు తనకు సూట్ కావని తాజాగా అనుపమ అభిప్రాయపడింది. గ్లామర్ పేరిట నేను పొట్టి బట్టలు వేసుకోలేను. నాకు అవి సరిపడవు. సాంప్రదాయదుస్తుల్లో కూడా అందంగా కనిపించవచ్చు. నేను సహజంగా కనిపించడానికే ఇష్టపడతా. షూటింగ్ ఉంటేనే నేను మేకప్ వేసుకుంటా. లేకపోతే సాధారణ అమ్మాయిలాగానే ఉంటాన
ని అనుపమ చెప్పడం విశేషం.
