ప్రస్తుతం దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్న ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ నటి, యాంకర్ రష్మి గౌతమ్. ఈ ఛాలెంజ్ గురించి ఆమె సోషల్‌మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్.. దీనిని మీరు నిజంగా సీరియస్‌గా తీసుకుంటున్నారా. అసలు ఇలాంటివి చేసేవాళ్లకి పనీపాటా లేదు. వీటిపై పెట్టే శ్రద్ధ పనికొచ్చే వాటిపై పెడితే బాగుంటుంది. ఈ ఛాలెంజ్‌లో పాల్గొనేవారు సెలబ్రిటీల పేర్లను వాడుకుంటున్నారు. అలాంటి వారు ఓసారి ఆ సెలబ్రిటీలు చేస్తున్న మంచి పనులను కూడా చూడండి. అభిమానులు అని చెప్పుకొంటున్న వారు సెలబ్రిటీలు చేసిన మంచి పనుల్లో కనీసం ఒక్కటి కూడా పాటించలేదు’ అని పేర్కొన్నారు.ఈ ట్వీట్ చూసిన అరుణ్ అనే నెటిజన్ సమాధానమిస్తూ.. ‘ఇప్పుడు ఛాలెంజ్‌కు మద్దతు తెలపడానికి అందరూ రష్మిని ఎగతాళి చేయడం మొదలుపెడతారు’ అని పేర్కొన్నారు. ఇందుకు రష్మి ప్రతిస్పందిస్తూ.. ‘నిజమే. మిగతా వారిలాగే నాకూ నా అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉంది. మీకు నచ్చితే తీసుకోండి. లేదంటే వదిలేయండి. ఎవరేమనుకున్నా నాకు పోయేదేం లేదు’ అని పేర్కొన్నారు.ఇటీవల బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఈ ఛాలెంజ్‌లో విజయవంతం అయ్యానంటూ వీడియోను పోస్ట్ చేశారు. దాంతో ఇతర సినీ ప్రముఖులతో పాటు సామాన్య ప్రజలు కూడా ఛాలెంజ్‌లో పాల్గొన్న వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ‘బాటిల్ క్యాప్ ఛాలెంజ్’ ఏంటంటే.. ఓ టేబుల్‌పై బాటిల్ పెట్టాలి. దాని మూతను బాటిల్‌కు పూర్తిగా తిప్పి పెట్టకూడదు. కొద్దిదూరంలో నిలబడి కాలితో బాటిల్ క్యాప్‌ను తన్నాలి. అయితే ఈ ప్రక్రియలో ఆ బాటిల్ కిందపడకూడదు.
previous article
బెజవాడ సింహం వంగవీటి రంగా….
next article
రాధికా ఆప్టే బండారం బయటపెట్టేసింది
Related Posts
- /No Comment
దేవుడి దర్శనం …. నాని ప్రసన్నం
- /No Comment