ఆంధ్రారాష్ట్ర మంత్రివర్గ మొట్టమొదటి సమావేశం ఈ రోజు సోమవారం జరుగనుంది. సచివాలయంలో ఈ రోజు ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో నిర్వహించే ఈ భేటీలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకుని ఆమోదించనున్నారు. నవరత్నాలతో కూడిన వైసీపీ మేనిఫెస్టో అమలే లక్ష్యంగా సమావేశం ఎజెండాను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఇప్పటికే అధికారులకు సర్క్యులేట్ చేశారని సమాచారం. కేబినెట్ భేటీలో ముఖ్యంగా ఎనిమిది అంశాలపై చర్చ జరుగుతుంది. ప్రధమ అంశంగా వృద్ధాప్య పింఛన్లు రూ.2250కు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదిస్తారు. రెండో అంశంగా ఆశా వర్కర్ల వేతనాలను రూ.10,000కు పెంపు నిర్ణయానికీ అంగీకారం తెలుపుతారు. తర్వాత ఏపీఎ్‌సఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, మునిసిపల్ శానిటరీ పనివారల వేతనాలు పెంపు, ఉద్యోగులకు 27 శాతం ఐఆర్, రైతు బంధు పథకం, హోంగార్డుల వేతనాల పెంపు, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దుపై కేబినెట్లో చర్చించి వీటిపై ఆమోదించనున్నారని సమాచారం. ఇంకొన్ని కీలకాంశాలనూ టేబుల్ ఐటెమ్స్‌గా చర్చించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.మరి ఈ రోజు జరిగే మొదటి సమావేశంలో ఏమి జరగ బోతుందో వేచి చూడాల్సినవసరం ఉంది.
పేషీల్లో మంత్రులు బొత్స, సురేశ్
ఆంధ్రారాష్ట్ర మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో ఇద్దరు మంత్రులు తమ పేషీల్లో దిరిగి, ఏర్పాట్లను సచివాలయంలో పరిశీలించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తన సతీమణి ఝాన్సీతో కలిసి ఆదివారం సచివాలయానికి వచ్చారు. రెండవ బ్లాకులో ఉన్న మున్సిపల్‌శాఖ చాంబర్‌ను, తన పేషీని ఇరువురూ పరిశీలించారు. అదే బ్లాకులో ఉన్న మున్సిపల్ కమాండ్ కంట్రోల్ రూంను కూడా పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ కూడా తన సతీమణితో కలిసి సచివాలయానికి వచ్చారు. ప్రాంగణంలో కలిదిరిగిన అనంతరం నాలుగో బ్లాక్‌లోని మొదటి అంతస్తులో ఉన్న విద్యాశాఖ పేషీలోకి అడుగు పెట్టారు. ఎలా తమ మంత్రులు తమ తమ పేషీ లను పరసలించి అక్కడ బాగోగులను తెలుసుకున్నారు.