ఇదే రోజు సరిగ్గా 30 ఏళ్ల క్రితం… అంటే, 1989 అక్టోబర్ 5 నా టాలీవుడ్ కింగ్ నాగార్జున, అమల హీరో హీరోయిన్లుగా, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘శివ’ విడుదలైనది.ఆ చిత్రం అప్పట్లో సంచలన విజయాన్ని సాధించింది. షూటింగ్ సమయంలో ఏర్పడ్డ పరిచయం, నాగార్జున జీవిత భాగస్వామిగా అమల మారేట్టుగా చేసింది కూడా.అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలోకి కాలుమోపిన వర్మ, పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ‘శివ’ను తీశాడు. ఇక ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయిన సందర్భంగా తన ఆనందాన్ని పంచుకుంటూ, “నాగ్. నేడు మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టినరోజు” అని ట్విట్టర్ చేశారు.