నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు అరెస్ట్ చేశారు. కోటంరెడ్డి తన ఇంటిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని, దాడి చేసేందుకూ ప్రయత్నించారని నిన్న సరళ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు, విచారణ జరిపి, కోటంరెడ్డి దాడి చేశారనడానికి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని అన్నారు. ఆపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు విషయం తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్, చట్టం ముందు అందరూ సమానమేనని, అనుచితంగా ప్రవర్తించే వారు ఎవరైనా ఉపేక్షించ వద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ కు స్పష్టం చేయడంతో ఆపై కోటంరెడ్డి ని అరెస్ట్ చేశారు పోలీసులు.