మెగా హీరో చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రం హిట్ టాక్ సంపాదించుకున్న నేపథ్యంలో చిత్రయూనిట్ సంతోషంలో ఉంది. ఈరోజు జరిగిన ‘సక్సెస్ మీట్’లో హీరో చిరంజీవి, నటులు సాయిచంద్, రవి కిషన్ ప్రముఖ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి, దర్శకుడు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. సాయిచంద్ మాట్లాడుతూ, ఓ గొప్ప చిత్రంలో మంచి పాత్ర వేస్తున్నానని అనుకున్నాను కానీ, ఇంత మంచి పాత్ర పోషిస్తున్నానని, ఆ పాత్రకు ఇంత స్పందన ఉంటుందని అప్పుడు ఊహించలేదని అన్నారు. చిరంజీవి గారూ, కొన్ని వేల కోట్ల కృతజ్ఞతలు మీకు చెప్పినా కూడా నా రుణం తీరదేమో.తెలుగు ప్రేక్షకుల కోసం ఒక్కమాట.. సినిమా అంటే ఇది! అని అన్నారు. ‘సైరా’ చిత్రంలో సాయిచంద్.. సుబ్బయ్య పాత్రలో నటించారు.