కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది.తనకు పుట్టిన బిడ్డ భారమవుతుందని భావించిన ఓ తల్లి, కళ్లు తెరవని పసిగుడ్డును వదిలేసి వెళ్లిపోయింది. ఏ మాత్రం కనికరం చూపని ఓ ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్, నర్స్, చిన్నారిని చెత్తకుప్పలో పడేశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ ప్రసవించింది. మరుసటి రోజు బిడ్డను ఆమె వదిలేసి వెళ్లిపోయింది.నర్సింగ్ హోమ్ డాక్టర్ ధన్వంతరి శ్రీనివాసాచార్య, ఏఎన్ఎం బేబీ రాణిలు కలిసి, ఆ బిడ్డను దగ్గర్లోనే ఉన్న శ్రీ వెంకటేశ్వరాలయం వద్ద ఉన్న చెత్తకుప్పలో పడేశారు. బిడ్డను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి బిడ్డను తరలించినా, పాప ప్రాణాలు దక్కలేదు. కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్, నర్స్ లను అదుపులోకి తీసుకున్నారు.