విజయ్ నిర్మల మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీని బ్రేక్ చేసింది. టాలీవుడ్ సీనియర్ హీరోలు అంత తనకు నివాళు అర్పిస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఎంతో బాధకు గురయ్యారు.
మాజీ ఎంపీ మురళీమోహన్ : విజయనిర్మలను పనిరాక్షసి అనేవాళ్లని. సినీ పరిశ్రమకు తీరని లోటు అని పేర్కొన్నారు. దర్శకురాలిగా తన కొత్తదనాన్ని నిరూపించుకున్నారని పేర్కొన్నారు. విజయనిర్మల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
చిరంజీవి: ఆమె మృతి తనను దిగ్ర్భాంతికి గురి చేసిందని పేర్కొన్నారు. విజయనిర్మల బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. విజయనిర్మల నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారని చిరంజీవి పేర్కొన్నారు.
బాలకృష్ణ :బాలా నటి నుంచి ఎన్నో గొప్ప చిత్రాల్లో విజయనిర్మల నటించారని కొనియాడారు. ఎన్టీఆర్‌తో మారిన మనిషి, పెత్తందార్లు, విచిత్రకుటుంబం సినిమాల్లో విజయనిర్మల నటించారని పేర్కొన్నారు. 44 చిత్రాలకు దర్శకత్వం చేయడం చాలా గొప్ప విషయమన్నారు. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించి మహిళలకు ఆదర్శంగా నిలిచారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి: నిర్మల మృతికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటన్నారు. అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా ఆమె గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కారని గుర్తు చేశారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.