ఎమ్మెల్యేకు మాత్రం పోలీస్ స్టేషన్ లో రాజమర్యాదలు చేశారు..!

MLA made royal courtesy at police station ..!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఘాటుగా స్పందించారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఓ మహిళా ఎంపీడీవో అర్ధరాత్రి వేళ ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళితే కేసు నమోదు చేసేందుకు 8 గంటల పాటు తర్జనభర్జన పడ్డారని అన్నారు. ఆమె కష్టాలకు కారకుడైన వైసీసీ ఎమ్మెల్యేకు మాత్రం పోలీస్ స్టేషన్ లో రాజమర్యాదలు చేశారు అని అన్నారు. దసరా ఉత్సవాలను స్త్రీశక్తికి సూచికగా జరుపుకుంటారని, అలాంటి వేళ విధి నిర్వహణలో నిజాయతీగా వ్యవహరించిన ఓ మహిళా అధికారికి జగన్ ప్రభుత్వం చేసిన అన్యాయం ఇది అన్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం, ఆపై ఆయన కొన్ని గంటల్లోనే బెయిల్ పై బయటికి రావడం తెలిసిందే.

Leave a Response