ప్రగతి నివేదన సభలో కూలిన భారీ కటౌట్… తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్: అట్టహాసంగా ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభకు వరుణుడు ఆటంకం కల్గిస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కొంగరకలాన్‌లో భారీ వర్షం పడింది. దీంతో సభాప్రాంగణంలోకి నీరు చేరింది. వర్షానికి వేదిక తడిచిముద్దయింది. ప్రాంగణంలో ఉన్న కటౌట్ కూలిపోయింది. ఇప్పటికే కొంగరకాలాన్‌కు వివిధ జిల్లాల నుంచి ప్రజలు వచ్చారు. వీరు ట్రాక్టర్లు, బస్సుల్లో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇప్పటివరకు 50వేల మంది దాక సభకు తరలివచ్చారు. అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పరుగులు తీశారు. భారీ వర్షానికి సభికులు తడిచిముద్దయ్యారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబరు 2న నిర్వహించతలపెట్టిన ప్రగతి నివేదన సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ నిర్వహణకు సంబంధించి పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు కమిటీలను నియమించారు. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్‌, మహేందర్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డిలను సభ నిర్వహణ సమన్వయకర్తలుగా నియమించారు. నిర్వహణ బాధ్యతల కోసం 8 కమిటీలను నియమించారు.

Leave a Response