పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకుడు నాదెండ్ల మనోహర్ ట్విటర్ వేదికగా తెలిపారు. చిరు, పవన్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేశారు. ‘నేను, కల్యాణ్ గారు చిరుతో కలిసి అద్భుతమైన సమయం గడిపాం. అనేక విషయాల గురించి చర్చించుకున్నాం. చిరు జీవిత ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయనకు మరిన్ని విజయాలు అందాలని కోరుకుంటున్నా. చిరుతో మరోసారి ఇలాంటి అద్భుతమైన సమావేశం జరగాలని ఆశిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ఫొటో కాస్త సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మెగా సోదరులు ఒక్క ఫ్రేంలో ఉండటంతో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది.చిరు ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. నయనతార, తమన్నా, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
previous article
మాధవన్‌కు అమ్మాయిల్లో ఉన్న క్రేజ్ తగ్గలేదు….
next article
యాక్టింగ్‌కు గుడ్‌బై చెప్పేస్తాను……
Related Posts
- /No Comment
కర్ణాటకలో ఆగిన ఉప ఎన్నికలు..!
- /No Comment