బాలీవుడ్ దబాంగ్ సినిమాతో పరిచయమైన సోనాక్షి సిన్హా నటించిన తాజా చిత్రం ఖాన్దాని షఫాఖానా
. ఈ చిత్రంలో సెక్స్ క్లినిక్‌ను నడిపే యువతి పాత్రలో సొనాక్షి నటించింది. అడల్ట్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో సొనాక్షి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలుగా మారాయి.మన దేశంలో అన్ని విషయాల గురించి మాట్లాడతారు కానీ, ఎంతో ప్రధానమైన శృంగారం గురించి మాత్రం మాట్లాడరు. సెక్స్ గురించి మాట్లడకూడదని పెద్దలు నూరిపోస్తుంటారు. శృంగారం అంటే అంత ఇబ్బందికరమైనదైతే మన దేశ జనాభా ఎందుకింత ఎక్కువగా ఉంది. మన ప్రజలందరికీ సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం. అందరికీ అర్థమయ్యేలా సెక్స్ పాఠాలు చెప్పాలి. మిగతా ఆరోగ్య సమస్యల్లాగానే సెక్స్ సంబంధిత వ్యాధుల గురించి కూడా నిర్భయంగా మాట్లాడగలగాల`ని సోనాక్షి వ్యాఖ్యానించింది.