ఇంటర్ అవకతవకలపై నిరసన తెలుపుతూ ఈనెల 29న చలో ఇంటర్ బోర్డుకు విపక్షాలు పిలుపు ఇచ్చాయి. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మీడియాతో మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నా చలో ఇంటర్ బోర్డ్ కార్యక్రమం జరిపి తీరుతామన్నారు. ఇంటర్‌బోర్డు తీరుతో 23 మంది విద్యార్థులు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యాపకులు, ప్రిన్సిపల్స్ హెచ్చరించినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ఐదారు రోజుల తర్వాత సీఎం స్పందించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. ఏ ఒక్క పరీక్షను కూడా ప్రభుత్వం సక్రమంగా నిర్వహించలేదని కోదండరామ్ ఆరోపించారు.
previous article
తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తి
next article
మహేష్ కోసం ‘సరిలేరు నీకెవ్వరూ’
Related Posts
- /No Comment
“గ్యాంగ్ లీడర్” లో “RX100”
- /No Comment