టెస్టుల్లో లైట్ తగ్గినాకే కావాలని భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసిందని దాని వల్ల తమ జట్టు త్వరగా వికెట్లు కోల్పోయిందంటూ సౌతాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ సంచలన కామెంట్స్ చేశాడు.మూడు టీ-20లను టైగా ముగించుకున్న సఫారీలు.. టెస్టుల్లో మాత్రం చెతికిలపడ్డారు. మూడు టెస్ట్‌ల సిరీస్‌ని భారత్ 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు ఓటమితో స్వదేశంలో అడుగుపెట్టింది. ‘‘ప్రతీ టెస్ట్ మ్యాచ్ కాపీ.. పేస్ట్‌ల జరిగింది. వాళ్లు తొలుత బ్యాటింగ్ చేయడం 500ల పరుగులు స్కోర్ చేయడం, ఆ తర్వాత లైట్ పోయాక డిక్లేర్ చేయడం చేశారు. దీంతో మొదటి మూడు వికెట్లు వాళ్లకు లభించేవి. మూడో రోజు ఆట ప్రారంభించినప్పుడు మేము ఒత్తిడిలో ఉండే వాళ్లం’’ అని డుప్లెసిస్ పేర్కొన్నాడు . టెస్టుమ్యాచుల్లో టాస్‌ను తొలగిస్తే విదేశాల్లో పర్యటించే జట్లకు లాభం చేకూరే అవకాశం ఉందని అతను అన్నాడు. ‘‘చివరి టెస్టులో మా ఆటను గమనిస్తే, మాకు ఆరంభం మంచిగా లభించింది. అయితే ఎక్కువసేపు ఆడాలి అనే పరిస్థితి వచ్చే సరికి.. మేము చెత్తగా ఆడటం ప్రారంభించాము. ఒకవేళ టాస్‌ని తొలగిస్తే, మాకు ఇంకా మంచి అవకాశం ఉండేది. సౌతాఫ్రికాలో వేరే జట్లు వచ్చినప్పుడు అలా చేసేందుకు మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే మేము గ్రీన్ పిచ్‌లపై ఆడుతాము’’ అని అతను పేర్కొన్నాడు.డుప్లెసిస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని అభిమానులు మండిపడుతున్నారు. గెలుపును ఎంజాయ్ చేసినప్పుడు ఓటమిని కూడా జీర్ణించుకోవాలని.. లేని పక్షంలో అతను ఆ పదవికి అర్హుడు కాదని కామెంట్ చేస్తున్నారు.