సోనియా, రాహుల్ సైతం ఊహించనివిధంగా ఫలితాలు..!

Unexpected results of Sonia and Rahul ..

మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని అంతా భావించారు. కనీసం పోటీ కూడా ఇవ్వలేదంటూ తీసిపాడేశాయి. సోనియా, రాహుల్ సైతం ఊహించనివిధంగా మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కు ఫలితాలు వచ్చాయి.మహారాష్ట్రలో బీజేపీ కూటమికి దాదాపు 150 సీట్లు వస్తే,కాంగ్రెస్ మిత్రపక్షాలకు కలిపి 100 సీట్లొచ్చాయి. హర్యానాలోనైతే ఎవ్వరూ ఊహించనివిధంగా కాంగ్రెస్ సత్తా చాటింది. కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్టేనని సర్వే సంస్థలన్నీ లెక్కగడితే, ఏకంగా 30కి పైగా స్థానాలను గెలుచుకుని హస్తం పార్టీ సత్తా చాటింది. కాంగ్రెస్ ఊహించనిదానికంటే మంచి ఫలితాలు వచ్చాయి. అయితే, సోనియా, రాహుల్ లు ప్రచారానికి రానుందుకే మహారాష్ట్ర, హర్యానాల్లో కాంగ్రెస్ కి కొంతలో కొంత మెరుగైన ఫలితాలు వచ్చాయని, ఒకవేళ వాళ్లు వచ్చుంటే మాత్రం ఇన్ని సీట్లు వచ్చేవే కాదని సెటైర్లు పేలుతున్నాయి. మరి, మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలను సోనియా, రాహుల్ లు పట్టించుకోకపోవడం పార్టీకి మైనస్ అయ్యిందో ప్లస్ అయ్యిందో తెలియదు కానీ, జాతీయ నాయకులు కష్టపడి ఉంటే మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ తరహాలో రిజల్ట్స్ వచ్చేవన్న చర్చ జరుగుతోంది.

Leave a Response