గెలిచిందే 23 ఎమ్మెల్యేలు అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఆ సంఖ్య రెండు ప్లస్ మూడు, ఐదుకి పడిపోయినా ఆశ్చర్యం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.పలువురు టీడీపీ నేతలు వైసీపీ, బీజేపీ పార్టీల వైపు చూస్తున్నారు.వంశీకి వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వీరిద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడటమే కాకుండా, ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. జగన్ మాత్రం వంశీని ఎమ్మెల్యేగా రాజీనామా చేసి రమ్మన్నారని, రాజ్యసభకు పంపుతామని హామీ ఇచ్చారని వార్తలొస్తున్నాయి. మరి వంశీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరితే.. రాజ్యసభకు వెళ్తారా? లేక వైసీపీ గుర్తుపై తిరిగి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.టీడీపీ అంటే నాయకులను తయారుచేసే ఫ్యాక్టరీ అని పేరుండేది. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్నో రంగాలకు చెందిన వారు, మధ్యతరగతి వారు, మహిళలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాదరణ పొంది మంచి నాయకులుగా పేరుతెచ్చుకున్నారు. టీడీపీ లో నాయకులుగా ఎదిగి ఇతర పార్టీల్లో చేరి మంచి స్థానాల్లో ఉన్నవారు ఎందరో ఉన్నారు. వంశీ పొతే ఏంటి? పార్టీనే నమ్ముకొని ఉన్న నిజాయితీపరుడైన కార్యకర్తను నాయకుడిని చేయండి లేదా యువ నాయకుడు నారా లోకేష్ ని బరిలోకి దింపండని కార్యకర్తలు కోరుతున్నారు.ఒకవేళ లోకేష్ ఓడిపోయినా పోరాట పటిమ కనబరిచారని, కార్యకర్తలు ఆయన వెంట ధైర్యంగా నడిచే అవకాశముంది.బాబుకి రిటైర్మెంట్ టైం వచ్చింది, లోకేష్ పై ఇంతవరకు ప్రజల్లో పూర్తి నమ్మకం కలగలేదు. బాబు ఇంకా అలాగే భయంభయంగా పోరాడితే లోకేష్ పై పడిన పప్పు అనే ముద్ర పోదు. ఇలాంటి సమయంలోనే కార్యకర్తల్లో ధైర్యం నింపేలా లోకేష్ ని బరిలోకి దింపితే.. అటు పార్టీకి, ఇటు లోకేష్ కి మంచిదని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.