ప్రాణమున్నంతవరకు తెలుగుదేశం పార్టీలోనే..

In the Telugu Desam Party ..

జగన్మోహన్ రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్న దేవినేని అవినాష్ ఇసుక కొరతతో లక్షలాది కార్మికులు రోడ్డునపడ్డా పట్టించుకోవడం లేదని ఫైరయ్యారు. ఇసుక కార్మికుల కుటుంబాల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని, ఆకలి బాధ తీర్చుకోవడానికి చివరికి చోరీలకు పాల్పడే పరిస్థితులు నెలకొంటున్నాయని అన్నారు. ఇక, తెలుగుదేశంలో యాక్టివ్ గా ఉండే నేతలను టార్గెట్ చేస్తూ అక్రమ కేసులతో వేధిస్తున్నారని దేవినేని అవినాష్ ఆరోపించారు. అలాగే తమ అసమర్ధతను కప్పి పుచ్చుకునేందుకే మీడియాపై ఆంక్షలు విధించారని నిప్పులు చెరిగారు. ఇసుక కొరతపై అక్టోబర్ 24న దీక్షలు చేపట్టనున్నట్లు దేవినేని అవినాష్ ప్రకటించారు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కొద్దిరోజులుగా జరుగుతోన్న ప్రచారాన్ని టీడీపీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఘాటుగా స్పందించారు. తన కంఠంలో ప్రాణమున్నంతవరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటానంటూ తేల్చిచెప్పారు. జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన దేవినేని అవినాష్ అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి అసత్య ప్రచారానాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

Leave a Response