సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మహిళలకు మెప్మా రుణాలు, చెత్తబుట్టల పంపిణీ కోసం ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ నియోజయకవర్గ ఎమ్మెల్యేగా హరీష్ రావు సభకు హాజరుకావాలిసి ఉంది. అయితే ఆయన ఏకంగా 4 గంటలు సభకు ఆలస్యంగా వచ్చారు. కావున 11:30కు మొదలు కావలసిన సభ మధ్యాహ్నం 3:30కు మొదలైంది. 4 గంటలు ఆలస్యమైనా ఎంతో ఓపికతో వేచి చూసిన మహిళలకు క్షమాపణలు చెప్పడమే కాకుండా..తన వల్లే సభ ఆలస్యంగా మొదలైందని మంత్రి హరీష్ రావు తనకు తాను రూ.50లక్షల జరిమానా విధించుకున్నారు.మహిళా భవనం కోసం నిధులను మంజూరు చేయాలని అక్కడి మహిళలు హరీష్ రావు గారికి విజ్ఞప్తి చేశారు. ఒక్క క్షణం ఆలోచించకుండా ఆయన అందుకు ఒప్పుకోవడమే కాకుండా వెంటనే రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఆయన మాటలు విన్న అక్కడి మహిళలు హర్షం వ్యక్తం చేశారు. హరీష్ రావు తనకు తాను జరిమానా విధించుకున్న విధానాన్ని సిద్దిపేట ప్రజలు ప్రశంసించారు. ఇంత నిక్కచ్చిగా ఉండేవాడు..మా నాయకుడు అవ్వడం మా అదృష్టమని హరీష్ రావుని అందనమెక్కిచ్చారు.లక్షలు..లక్షలు.. దోచుకున్న నాయకులని చూస్తున్న ఈరోజుల్లో తనకు తానే జరిమానా విధించుకున్నాడు హరీష్ రావు.