మరో దారుణం…

హైదరాబాద్ శివార్లలో మరో ఘోరం జరిగింది. 35 ఏళ్ల మహిళను దుండగులు తగులబెట్టారు. పోచమ్మ దేవాలయం పక్కనే ఆ మహిళను దహనం చేశారు. ప్రియాంకని చంపిన ప్రాంతానికి ఈ మహిళ డెడ్ బాడీ కనిపించిన ప్రాంతానికి దూరం కేవలం ఒక్క కిలో మీటర్ మాత్రమే. ఈ మహిళ ఎవరన్నది తెలుసుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. తగలబెట్టిన ప్రాంతానికి 200 ల మీటర్ల దూరంలో హీరో రవితేజ నటిస్తున్న సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్ చూసేందుకు వచ్చిన నలుగురు స్థానికులు మంటలను గమనించి ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే 70 శాతానికి పైగా బాడీ కాలిపోయింది. ఇద్దరూ మహిళలే, ఇద్దరి డెడ్ బాడీలను తగలబెట్టారు. 35 ఏళ్ల మహిళ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు, ఇవాళ పోస్టుమార్టం చేయనున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో కొన్ని ఆధారాలను సేకరించారు. మృతురాలి చెప్పులు, దుస్తులను క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జరిగిన చోటు నుంచి ఔటర్ రింగ్ రోడ్ వైపు డాగ్ స్క్వాడ్ వెళ్లింది. దీని ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు.

Tags:hyderabad

Leave a Response