కంచుకోటలో ఏం జరుగుతుంది?

What Happens in kanchukota?

ఉత్తమ్ కు మంచి పట్టున్న హుజూర్ నగర్ లో సైతం ఓడిపోవడాన్ని కాంగ్రెస్ నేతలు జీర్జించుకోలేకపోతున్నారు.పైగా కాంగ్రెస్ సిట్టింగ్ సీటులో టీఆర్ఎస్ కు అంత భారీ మెజారిటీ ఎలా వచ్చిందంటూ పోస్టుమార్టం మొదలుపెట్టారు. అభ్యర్ధి ఎంపికపై చెలరేగిన రగడ ఒక కారణమైతే, పార్టీలో అంతర్గత విభేదాలు, సమన్వయ లోపం, అలాగే వ్యూహరచనలో వ్యూహాత్మక తప్పిదాలే కారణమని భావిస్తున్నారు. ఇక, అధికార పార్టీ ఉపఎన్నికను సీరియస్ గా తీసుకుని మొత్తం గులాబీ యంత్రాంగానే రంగంలోకి దించి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తే, కాంగ్రెస్ నేతలు మాత్రం పోల్ మేనేజ్ మెంట్ లో ఘోరంగా విఫలమైందని అంటున్నారు. తక్కువ మెజారిటీతోనైనా విజయం లాంఛనమేనన్న అతి విశ్వాసం కూడా కాంగ్రెస్ కొంప ముంచిందంటున్నారు. ఇక, టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీసీసీ అగ్రనేతలు విఫలమయ్యారని, కానీ చేసినవి చేయనవి చెప్పుకోవడంలో టీఆర్ఎస్ సక్సెస్ అయ్యిందని అంటున్నారు. మరోవైపు రేవంత్ టార్గెట్ గా సీనియర్లు చేసిన రచ్చ కూడా పార్టీకి మైనస్ గా మారిందని, ఓవరాల్ గా గ్రూపు గొడవలే మరోసారి కాంగ్రెస్ ను దెబ్బతీశాయని అంచనాకి వస్తున్నారు. ఇవన్నీ ఇలాగుంటే, టీఆర్ఎస్, ఓటుకి ఐదువేలు పంచిందని, అందుకే కంచుకోటలో కాంగ్రెస్ ఓడిపోవల్సి వచ్చిందని అంటున్నారు.

Leave a Response