టాలీవుడ్ హీరో మహేష్ బాబు 26వ సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా రేపు పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. ఈ సినిమాకి ‘సరిలేరు నీ కెవ్వరూ’ అనే టైటిల్ అనుకున్నారు. ఆ తరువాత ‘రెడ్డిగారి అబ్బాయి’ అనే టైటిల్ తెరపైకి వచ్చింది.
దాంతో ‘సరిలేరు నీ కెవ్వరూ’ అనే టైటిల్ లేనట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఈ టైటిల్ వైపే మహేశ్ బాబు మొగ్గుచూపాడట. అందువలన ఈ టైటిల్ నే రిజిస్టర్ చేయించారని అంటున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను 6 నెలల్లో పూర్తిచేసి, సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నట్టుగా తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందుతుండటంతో, అంచనాలు పెరిగిపోతున్నాయి.