‘నాన్నగారి బయోపిక్ తీయాలనుకుంటున్నా’ అంటూ గతంలో బాలకృష్ణ తనను కలిశారని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. సినిమాలో కాన్ ఫ్లిక్ట్ ఉంటేనే తాను సినిమా తీయగలనని బాలయ్యకు చెప్పానని తెలిపారు. ఎన్టీఆర్ గారికి సంబంధించిన కొందరు వ్యక్తులను బాలయ్యే తనకు పరిచయం చేశారని… వారి నుంచే తాను సమాచారం సేకరించి, సినిమా మొదలుపెట్టానని చెప్పారు. అందుకే ఈ సినిమాను బాలయ్యకు అంకితం చేస్తున్నానని తెలిపారు.sతాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని… ఏ పార్టీ నెగ్గినా తనకు లాభం లేదని, నష్టమూ లేదని వర్మ తెలిపారు. ఏదో ఒక పార్టీకి అనుకూలంగానో లేదా ఒక వ్యక్తికి వ్యతిరేకంగానో సినిమా తీయాల్సిన అవసరం తనకు లేదని చెప్పారు. పాతికేళ్ల క్రితం జరిగిన కథ ఒక వ్యక్తికి వ్యతిరేకంగా ఉండొచ్చేమో కానీ, వైసీపీకి అనుకూలంగా ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను ఫిల్మ్ మేకర్ నని, బిజినెస్ మెన్ కాదని చెప్పారు.