రజనీ ‘2.0’ చైనీస్‌ టైటిల్‌ ఏంటో తెలుసా..?

అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌-శంకర్‌ కాంబినేషన్‌లో గతేడాది విడుదలైన ‘2.ఓ’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రజనీ నటన, శంకర్‌ టేకింగ్‌ అందరినీ అలరించాయి. ఇప్పుడు ఈ సినిమా చైనాలో విడుదలకు సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాకు చైనాలో ఏ పేరు పెట్టారో తెలుసా? ‘బాలీవుడ్‌ రోబో 2.0: రిసర్జెన్స్‌’

‘బాహుబలి2’ స్థాయిలో ఈ సినిమా కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుందని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే రజనీకాంత్‌కు ఉన్న ఇంటర్నేషనల్‌ స్టార్‌డమ్‌ను దృష్ట్యా మంచి ఓపెనింగ్స్ ‌వస్తాయని చెబుతున్నారు. చైనాలో ‘2.ఓ’ విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 56వేల స్క్రీన్స్‌పై దీనిని విడుదల చేయనున్నారు. ఇందులో 47వేల 3డీ స్క్రీన్స్‌ ఉండటం గమనార్హం. చైనాలో హెచ్‌వై మీడియా ‘2.ఓ’ విడుదల చేయనుంది. దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.800కోట్లకు పైగా వసూలు చేసింది.

Leave a Response