ఈ రోజు భారత్ కు రెండొవ మ్యాచ్ జరగబోతుంది. ఈ ప్రపంచ కప్ లో రెండు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచినా ఆస్ట్రేలియా తో భారత్ తలపడనుంది. కానీ ఆస్ట్రేలియా కు ఈ మ్యాచ్ అంత ఈజీ గా ఉండదు అని బోర్డర్ ఆసిక్తి వాక్యాలు చేసారు. ఈ ప్రపంచ కప్ రసవతంగా జరుగువుతున్నపుడికి ఈసారి ప్రపంచ కప్ గెలిచే జట్లేవంటే? వచ్చే సమాధానం ‘ఇంగ్లండ్, భారత్, ఆస్ట్రేలియా’. కప్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు జరగ్గా… టోర్నీని రక్తి కట్టించే ఆటతీరుకు పేరుగాంచిన ఈ మూడు జట్లు ఇంకా ఒక్కసారి కూడా పరస్పరం తలపడలేదు. లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఈ రోజు ఈ మైదానం లో భారత్–ఆస్ట్రేలియా నేడు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అఫ్గానిస్తాన్‌ను అలవోకగా ఓడించి, విండీస్‌కు ఎదురొడ్డి గెలిచిన కంగారూలు… దక్షిణాఫ్రికాపై విజయంతో ఆత్మవిశ్వాసంతో ఉన్న టీమిండియాలలో ఎవరు పైచేయి సాధిస్తారో సాయంత్రం వరకు వేచి చూడాల్సిన అవసరం ఉంది.
మూడు నెలల క్రితం ఆస్ట్రేలియా పరిస్తితేంటంటే. రెండేళ్లలో 33 వన్డేలు ఆడితే ఎనిమిదింట్లోనే గెలుపు…! కానీ, మార్చిలో జరిగిన భారత్‌తో వన్డే సిరీస్ ద్వారా ఆ జట్టు తీరే మారిపోయిందని చెప్పాలి. పరుగుల లేమితో కొట్టుమిట్టాడుతున్న కెప్టెన్ ఫించ్ సెంచరీల మీద సెంచరీలు చేసి పూర్తి ఫామ్‌లోకి వచ్చాడు. ఖాజా ఏకంగా ప్రపంచ కప్ బెర్తే కొట్టేశాడు. టీమిండియాపై 0–2తో వెనుకబడి మరీ 3–2తో సిరీస్ నెగ్గిన ఊపులో పాకిస్తాన్‌ను వైట్‌వాష్ చేసింది ఆసీస్. స్టార్క్ విండీస్‌పై 5 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌ను చూసినవారికి… ఎలాంటి పరిస్థితుల్లోనూ విజయంపై ఆశలు వదులుకోని, ఎంతటి ఒత్తిడిలోనూ ప్రత్యర్థికి అవకాశం ఇవ్వని ఒకప్పటి అచ్చమైన ప్రొఫెషనలిస్ట్ ఆస్ట్రేలియా గుర్తొచ్చి ఉంటే ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో కంగారూలను ఓడించాలంటే భారత్ పూర్తి శక్తి మేర ఆడాల్సి ఉంటుంది సమాచారం.
షార్ట్ బంతులతో పడగొట్టాలి
షార్ట్ బంతులను ఆడటంలో ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఇబ్బంది పడుతున్నారు. వార్నర్, ఫించ్, ఖాజాలు కరీబియన్ పేసర్ల ధాటికి నిలవలేకపోయారు. ఓ బంతి ఖాజా హెల్మెట్‌ను బలంగా తాకింది. ఈ బలహీనతను ఆసీస్ సహాయ కోచ్ పాంటింగ్ అంగీకరించాడు కూడా. టీమిండియా పేసర్లు దీనిని సొమ్ము చేసుకుంటే మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు.
తేల్చేది బుమ్రానే!
ఈ మ్యాచ్‌లో బుమ్రానే మెరవనున్నాడని క్రికెట్ అభిమానులంటున్నారు. బ్యాట్స్‌మెన్ ఏమాత్రం ఆడలేని విధంగా బంతు వేయడమే దీనికి కారణం కావచ్చు. బుమ్రా మొదట్లోనే చెలరేగి ఆసీస్ టాపార్డర్ ని కుప్పకూలహక్కులని ఆలా చేసినప్పుడు చహల్, కుల్దీప్ స్థిరంగా వికెట్లు తీయలని కోహ్లీ సేన ఆలోచిస్తుంది. మొదట బౌలింగ్‌కు దిగితే గాలులు వీస్తున్న పరిస్థితుల్లో స్వింగ్‌తో భువనేశ్వర్ ప్రభావం చూపగలడు అని భారత్ ఆశిస్తుంది.
ముఖాముఖి రికార్డు
భారత్ – ఆస్ట్రేలియా మధ్య ఇప్పటివరకు 136 వన్డేలు జరగ్గా భారత్ 49 గెలిచింది. ఆస్ట్రేలియా 77 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. పదింట్లో ఫలితం తేలలేదు. ప్రపంచ కప్‌లో పదకొండు మ్యాచ్‌లకు గాను భారత్ మూడింట్లో, ఆసీస్ ఎనిమిది మ్యాచ్‌ల్లో నెగ్గాయి.
ఈ రోజు ఫైనల్ టీమ్స్
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), రాహుల్, ధోని, కేదార్ జాదవ్, హార్దిక్, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా.
ఆస్ట్రేలియా: ఫించ్ (కెప్టెన్), వార్నర్, ఉస్మాన్ ఖాజా, స్మిత్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, క్యారీ, కూల్టర్ నైల్, కమిన్స్, స్టార్క్, ఆడమ్ జంపా.