బ్రెడ్‌ గులాబ్‌జామూన్ తయారీ విధానం

కావల్సినవి:
అంచులు తీసేసిన బ్రెడ్‌ స్లైసులు – నాలుగు,
చక్కెర – ముప్పావుకప్పు,
నీళ్లు – ముప్పావుకప్పు,
పాలపొడి లేదా మైదా – రెండు టేబుల్‌స్పూన్లు,
పాలు – పావుకప్పు,
నూనె – వేయించేందుకు సరిపడా,
యాలకులపొడి – అరచెంచా.
తయారీ:
ఓ బ్రెడ్‌స్లైసుని తీసుకుని పాలల్లో ముంచి వెంటనే తీసేసి గట్టిగా నొక్కాలి. ఇలా మిగిలిన స్లైసుల్నీ చేసుకుని అన్నింటినీ ఓ గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో పాలపొడీ లేదా మైదా వేసి ముద్దలా కలపాలి. ఈ ముద్దను చిన్నచిన్న ఉండల్లా చేసుకుని కాగుతోన్న నూనెలో వేసి ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో చక్కెరా, నీళ్లూ పోసి పొయ్యిమీద పెట్టాలి. చక్కెర కరిగి పాకం చిక్కగా అవుతున్నప్పుడు యాలకులపొడి వేసి దింపేయాలి. ఇందులో ముందుగా వేయించుకున్న బ్రెడ్‌ ఉండల్ని వేసుకుంటే చాలు.

Tags:bread gulab jamungulamjamun

Leave a Response