తన సినిమాలో నటించి తప్పు చేశాను….

కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటిస్తూ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు సంపాదించుకుంది టాలీవుడ్ హీరోయిన్ నయనతార. అయితే తాజాగా నయన్ నటించిన భారీ చిత్రాలు ఆమెకు కనీస గుర్తింపును కూడా తీసుకురాలేకపోయాయి. మెగాస్టార్ చిరంజీవి సైరా, తమిళ స్టార్ హీరో విజయ్ విజిల్ సినిమాలో నయన్ నటించిందన విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాల్లోనూ నయన్ కనీస ప్రాధాన్యం లేని పాత్రల్లో నటించి అభిమానులను నిరాశపరిచింది. ప్రస్తుతం నటిస్తున్న రజినీ దర్బార్ చిత్రంలోనూ నయన్‌ది అలాంటి పాత్రేనట. ఈ నేపథ్యంలో దర్బార్ దర్శకుడు మురుగదాస్‌పై నయన్ ఆగ్రహం వ్యక్తం చేయడం టాలీవుడ్ లో విశేషంగా మారింది. కెరీర్ ఆరంభంలో నయన్.. మురుగదాస్ రూపొందించిన గజినీ చిత్రంలో నటించింది. జీవితంలో తను చేసిన అతి పెద్ద తప్పు గజనీ చిత్రంలో నటించడం అని, కథ చెప్పినప్పుడు తన పాత్ర వేరే విధంగా ఉందని, సినిమాలో మాత్రం పూర్తి డమ్మీగా చూపించారని గతంలో నయన్ వ్యాఖ్యానించింది. ఆ సినిమా తర్వాత మురుగదాస్ సినిమాలో నయన్ నటించలేదు. చాలా ఏళ్ల తర్వాత దర్బార్ కోసం మళ్లీ వీళ్లిద్దరూ కలిసి పనిచేస్తున్నారు. ఈ సినిమాలో కూడా తన పాత్రకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్నారని నయన్ ఆవేదన వ్యక్తం చేసిందట. అలాగే రెమ్యునరేషన్ విషయంలో కూడా చిత్రయూనిట్‌పై ఆగ్రహంగా ఉందట ఈ అమ్మడు. తన సినిమా కోసం ఎంతో మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Image result for nayanthara

Leave a Response