టాలీవుడ్ డ్యాన్సర్ ప్రభుదేవా, టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా నటించిన సినిమా ‘అభినేత్రి’. ఈ సినిమా తెలుగులో మంచి వసూళ్లను రాబట్టింది. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు ‘అభినేత్రి 2’ అభిమానుల ముందుకు వస్తుంద. ఈ నెల 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది ఈ సినిమా. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు దర్శకుడు. ఈ సినిమాలో ఇటు ప్రభుదేవాను .. అటు తమన్నాను దెయ్యం ఆవహించినట్టుగా చూపించారు. ఈ ఇద్దరిలో ఎవరిని ఎప్పుడు దెయ్యం ఆవహిస్తుందో .. ఎప్పుడు వదిలేస్తుందో తెలియని అయోమయపు పాత్రలో కోవై సరళ కామెడీ నవ్విస్తుందన్న మాట. ఇక మరింత కామెడీ డోస్ పెంచడానికి సప్తగిరి ఉండనే వున్నాడు. ‘అభినేత్రి’ స్థాయిలో ఈ సీక్వెల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.
previous article
దర్శకుడి కోసం ఏడ్చినా సాయి పల్లవి…
next article
‘బ్రోచేవారెవరురా’ నుంచి లిరికల్ సాంగ్…
Related Posts
- /No Comment
మాస్ ఇమేజ్ ను కూడా కాపాడుకునే ఆలోచనలో రామ్..?
- /No Comment